Asia Cup 2023 : రోహిత్ శర్మ క్రేజీ రికార్డు నమోదు

Asia Cup 2023 : టీమ్ ఇండియా ఆసియా కప్‌ 2023 చాంపియన్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ ఫైనల్స్‌ లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక పై టీమిండియా విజయం సాధించింది. దీంతో 8వ సారి టీమ్ ఇండియా ఆసియా కప్‌ 2023 చాంపియన్‌ గా నిలిచింది. అయితే.. ఈ తరుణంలోనే.. ఆసియాకప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.

Rohit Sharma matches Dhoni as India end 5-year trophyless run with 8th Asia Cup
Rohit Sharma matches Dhoni as India end 5-year trophyless run with 8th Asia Cup

 

250 వన్డే మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్… ఆసియాకప్ హిస్టరీలో 5 ఫైనల్స్ ఆడిన తొలి ప్లేయర్గా నిలిచారు. అదే విధంగా ఆసియాకప్ లో ధోని కెప్టెన్సీలో భారత్ 9 మ్యాచులు గెలవగా… తాజా విజయంతో రోహిత్ ఆ రికార్డును సమం చేశారు. ఆసియాకప్ లు రెండుసార్లు అందించిన ధోని, అజారుద్దీన్ రికార్డును సైతం హిట్ మ్యాన్ అందుకున్నాడు. దీంతో క్రేజీ కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ.