“స్కంద” మూవీ నుండి “కల్ట్ మామ” సాంగ్ రిలీజ్ !

-

ఈ రోజు వినాయకచవితిని పురస్కరించుకుని కొన్ని సినిమాల మేకర్స్ తమ తమ సినిమాల నుండి అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక వాంటెడ్ మూవీ నుండి అద్భుతమైన అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టాలీవుడ్ హీరో రామ్ పోతినెని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “స్కంద”. ఇందులో రామ్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ , సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఊర్వశి రౌతెలా నటించిన స్పెషల్ సాంగ్ “కల్ట్ మామ” విడుదల అయింది. ఇందులో రామ్ ఫుల్ మాస్ పాత్రలో నటిస్తుండగా…

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది. మరి రామ్ గత సినిమా ది వారియర్ ఫెయిల్యూర్ అయిన కారణంగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సి ఉంది. మరి చూద్దాం స్కంద ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో ?

Read more RELATED
Recommended to you

Latest news