ఉక్రెయిన్ కు మద్దతుగా పోరాటం చేస్తాం … బదులుగా పంజాబ్ విముక్తికి సహకరించాలి: ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ

-

ఎప్పుడూ భారత్ పై విషం చిమ్ముతూ ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్.. తాజాగా రష్య- ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ కు మద్దతుగా పోరాడుతామని.. అందుకోసం విదేశీ యోధుల సైన్యాన్ని ఏర్పాటు చేయాలంటూ.. ఖలిస్తానీ సిక్కులు ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుతామని ఆ సంస్థ కీలక ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ ఫన్నూ అన్నాడు. దీనికి సంబంధించి ఓ లేఖను కూడా రాశాడు. యూఎన్ఓలో ఓటింగ్ దూరంగా ఉన్న ఇండియా రష్యాకు మద్దుతు ఇస్తున్న విధంగా కాకుండా.. మేం ఉక్రెయిన్ కు సహాయపడుతామని ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రత్యేకమైన సిక్ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరారు. 

అయితే బదులుగా భారత్ నుంచి పంజాబ్ విముక్తి కోసం ఉక్రెయిన్ సహకరించాలని డిమాండ్ చేశాడు. భారత్ నుంచి పంజాబ్ ను విడగొట్టేందుకు ఇదే మంచి సమయం అంటూ పన్నూ అన్నాడు. సిక్కులకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని అన్నారు. గత మూడు దశాబ్ధాలుగా నాటో, పాశ్చత్య దేశాలు భారత్ కు మద్దుత ఇవ్వడాన్ని తప్పుపట్టాడు. ఇప్పుడు రష్యా వైపు ఉందంటూ.. అవాకులు చెవాకులు పేలాడు. గ

గతంలో రైతు నిరసనల్లో సిక్ ఫర్ జస్టిస్ పాత్ర ఉంది. ఎర్రజెండాపై ఖలిస్తాని జెండా ఎగరవేయడం పాటు జనవరిలో ప్రధాని కాన్వాయ్ ని పంజాబ్లో అడ్డుకోవడంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ ప్రమేయం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version