టీమిండియా కెప్టెన్‍గా రుతురాజ్ గైక్వాడ్..

-

ఆసియా క్రీడల్లో పోటీపడే భారత క్రికెట్ జట్టుకు యువ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఈవెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు ఈ క్రీడల్లో బరిలోకి దిగే మహిళల జట్టులో తెలుగు అమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు. హర్మన్ ప్రీత్ కెప్టెన్ గా వ్యవహరించనుంది.

ఆసియా క్రీడల జట్టు – రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బైగా- యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version