సద్గురు స్వామిజీ చిక్కుల్లో పడ్డారు. బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మారుస్తున్నారని ఈషా ఫౌండేషన్ వివాదంలో చిక్కుకుంది.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈషా షౌండేషన్ లో దాదాపు 150 మంది పోలీసుల సోదాలు నిర్వహించినట్లు సమాచారం. యోగ, ఆధ్యాత్మికతను అందించడానికే సద్గురు ఈషా ఫౌండేషన్ స్థాపించారని సంస్థ ప్రకటన చేసింది. పెళ్లి చేసుకోవడం, సన్యాసం స్వీకరించడం ప్రజల అభీష్టం.. వారికి స్వేచ్ఛ, జ్ఞానం ఉన్నాయని తెలిపింది. బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం తీసుకోమని ఎవరినీ బలవంతంపెట్టబోమని కూడా పేర్కొంది.
సన్యాసం స్వీరించని వేలాది మందికి ఈషా యోగా కేంద్రం నిలయంగా ఉందని ఫౌండేషన్ ప్రకటన చేసింది. తన కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా సన్యాసం ఇచ్చారని మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.కామరాజ్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కామరాజ్ పిటిషన్ పై విచారించి ఈషా ఫౌండేషన్ లో సోదాలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈషా షౌండేషన్ లో దాదాపు 150 మంది పోలీసుల సోదాలు నిర్వహించినట్లు సమాచారం.