ఐపీఎల్ 2023 సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన 1000వ ఐపిఎల్ మ్యాచ్లో 6 వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో యశస్వి జైస్వాల్ శతకం వృధా అయ్యింది.ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. అయితే, రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులే చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో క్లీన్ బౌల్ద్ అయ్యాడు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం హిట్ మాన్ అవుట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అవుట్ కాలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎల్ఈడి స్టంపులపైన ఉంచిన బెయిల్స్ లో రెడ్ లైట్ వెలగడంతో రోహిత్ తో సహా వాంకడే స్టేడియం వద్ద వేలాదిమంది ముంబై అభిమానులు సాంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కేవలం ఐదు బంతుల్లోనే ముగిసింది. అతని బ్యాట్ నుంచి మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.
మ్యాచ్లో మూడు పరుగులు చేసిన తర్వాత సందీప్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే సంజూ శాంసన్ చేతివేలు తగలడంతోనే బేయిల్స్ పడిపోయాయని ఫీల్డ్ అంపైర్ కూడా ఇది గమనించకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే రోహిత్ శర్మ అవుట్ కాలేదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. రోహిత్ ఔట్ కాలేదని శాంసన్ చేతి వేలు తగలడం వల్లే బెయిల్స్ పడిపోయాయని, కాగా అదే సమయంలో బాల్ బేయిల్స్ ను దాటి వెళ్లడం, లైట్స్ వెలగడం కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ గమనించకుండా అవుట్ గా ప్రకటించాడు.