సంకల్ప్ సిద్ధి స్కామ్‌ సంచలనం..వంశీ-బోండా వార్..!

-

ఏపీలో సంకల్ప్ సిద్ధి స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే..ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో దీనిపై పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ స్కామ్‌లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ స్కామ్‌తో తనకు సంబంధం లేదని కావాలని టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి..ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్‌లో వందల కోట్లు సంపాదించనని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో, టీవీ5, ఏబీఎన్‌ల్లో లైవ్ ఇచ్చారని..తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అలాగే టీడీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు

ఇక వంశీ ఫిర్యాదుపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు. ఈ స్కామ్‌లో వంశీ, కొడాలి నానికి సంబంధం ఉందని ఆరోపించారు. వంశీ, ఆయన అనుచరుడి పాత్ర బయట పెట్టాలని పోలీసులను బోండా డిమాండ్ చేశారు. విజయవాడలో బయటపడ్డ ఈ స్కామ్ చాలా పెద్ద కుంభకోణం అని, సీజ్ చేసిన సెల్‌ఫోన్ కాల్ లిస్ట్, డేటాను బయట పెట్టాలని కోరారు. వంశీ.. డీజీపీకి ఫిర్యాదు చేసినా నా వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

అయితే సంచలనం సృష్టిస్తున్న ఈ స్కామ్ ఏంటంటే.. విజయవాడ కేంద్రంగా గొలుసుకట్టు వ్యాపారం పేరిట వేలకోట్ల రూపాయలను దండుకుని.. నిందితులు బోర్డు తిప్పేశారు. సంకల్పసిద్ధి స్కీమ్ లో ప్రధాన నిందితుడు, గన్నవరం ప్రాంతానికి చెందిన వేణుగోపాల కృష్ణని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంత పెద్ద స్కీమ్ వెనుక అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రముఖుల పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రధానంగా వంశీ-కొడాలిలని టార్గెట్ చేస్తున్నారు.  చిన్నచిన్న మోసాలు జరిగితేనే తీవ్రంగా చర్యలు తీసుకునే పోలీసులు రకరకాల స్కీముల పేరుతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ వసూళ్ళకు పాల్పడినా ఆ వైపు కూడా తొంగిచూడలేదంటే నమ్మశక్యంగా లేదంటున్నాయి. మొత్తానికి ఈ స్కామ్ పెద్ద సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version