వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి, పార్టీ కీలక నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి, మాపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.విజయసాయి రెడ్డి విప్పితే మొత్తం అందరి బట్టలు విప్పినట్లు అవుతుంది. అడ్డగోలుగా మాట్లాడే వాళ్లకు ఏం సమాధానం చెప్తాం? అని అన్నారు. ఇలాంటి వాళ్లను మేము ఎంతో మందిని చూశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.