అందరికీ ‘రామ్‌ రామ్‌’.. మధ్యప్రదేశ్ సీఎం ట్వీట్‌పై దుమారం

-

మూడు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిన బీజేపీ ఇప్పుడు సీఎం అభ్యర్థులు ఎవరన్నదానిపై ఫోకస్ పెట్టింది. ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తర్జనభర్జన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది.

‘అందరికీ రామ్‌ రామ్‌’ అంటూ శనివారం రోజున శివరాజ్ సింగ్ ట్వీట్‌ చేశారు. అయితే తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే అలా ట్వీట్‌ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు అధిష్ఠానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

మరోవైపు ట్వీట్‌పై చౌహాన్‌ స్పందిస్తూ… ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్‌.. రామ్‌’ అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వ సాధారణమైందని, రాముడి పేరుతో దిన చర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్‌ చేశానని చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news