గ్యారంటీలు ప్రభుత్వానికి పెద్ద భారమే – కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 

-

 

 

కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ గ్యారెంటీల కారణంగా ప్రభుత్వం పైన భారం పడడం గ్యారంటీ అని… హాట్ కామెంట్స్ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కర్ణాటక, తెలంగాణ అలాగే హర్యాన రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ఇటు తెలంగాణలో గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ హర్యానాలో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది.

అయితే మహారాష్ట్ర ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటక లో ఐదు గ్యారంటీలు అమలు చేయడం చాలా కష్టమైపోయిందని.. భారంగా మారిందన్నారు. అయినప్ప టికీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని… ఐదేళ్లపాటు కొనసాగిస్తామన్నారు. ఈసారి గ్యారంటీల కోసమే 56 కోట్లు… ఖర్చు చేస్తున్నామన్నారు. దానికోసం బడ్జెట్ కూడా రూపొందించినట్లు వివరించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news