Punjab: సెక్యురిటీ విత్ డ్రా చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్ నేత దారుణ హత్య

-

పంజాబ్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత, ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలాను దారుణంగా హత్య చేశారు దుండగులు. పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మందికి పోలీస్ సెక్యురిటీని రద్దు చేసింది. అందులో సిద్దూ మూసేవాలా కూాడా ఒకరు. పంజాబ్ లో వీరందరికి సెక్యురిటీ విత్ డ్రా చేసిన 48 గంటల్లోనే కాంగ్రెస్ నేత హత్య జరిగింది.

పంజాబ్ లోని మాన్సాలో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే సిద్దూ మూసేవాలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన అప్పటికే మరణించాడు. పంజాబ్ లో సింగర్ గా ప్రముఖ వ్యక్తిగా ఉన్న మూసేవాలా గతేడాది డిసెంబర్ లో పంజాబ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు మూసేవాలా. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్లే సిద్దూ మసేవాలా ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version