Mohammad Siraj : సిరాజ్ గొప్ప మ‌న‌సు.. చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయిన స్టేడియం

-

టీమ్ ఇండియా ఆసియా కప్‌ 2023 చాంపియన్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ ఫైనల్స్‌ లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక పై టీమిండియా విజయం సాధించింది. దీంతో 8వ సారి టీమ్ ఇండియా ఆసియా కప్‌ 2023 చాంపియన్‌ గా నిలిచింది. అయితే.. ఈ తరుణంలోనే.. టీమ్ ఇండియా పెసర్ సిరాజ్ గొప్ప మనసు చాటుకున్నారు.

Siraj donates Asia Cup final prize money to groundspersons

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సిరాజ్… తనకు వచ్చిన 5000 డాలర్ల(రూ.4.15 లక్షలు) ప్రైజ్ మనీని శ్రీలంక గ్రౌండ్స్ మెన్ కు ఇచ్చారు. దీనితో సిరాజ్ పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆటలోనే కాదు… సాయం చేయడంలోనూ సిరాజ్ తన గొప్పతనాన్ని చాటుకున్నారని పేర్కొంటున్నారు.

కాగా, ఆసియాకప్-2023 ఫైనల్ లో భారత బౌలర్లు చెలరేగడంతో లంక జట్టు 15.2 ఓవర్లలో 50 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు 6 వికెట్లు కోల్పోయిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version