BREAKING:మూడో రోజు ఈడీ విచారణకు సోనియా గాంధీ.. ఢిల్లీలో భారీ బందోబస్త్

-

“నేషనల్ హెరాల్జ్” వార్తా పత్రిక కేసులో మూడో రోజు కూడా విచారణ కొనసాగనుంది. ఇప్పటివరకు రెండు రోజులు, సుమారు 9 గంటలు పాటు సోనియా గాందీ ని విచారణ చేసారు ఈడి అధికారులు. ఈడి కార్యాలయం కు ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు వెళ్లనున్నారు సోనియా గాంధీ. సోనియా గాంధీ తో తోడుగా నిన్న ఆసాంతం ఉన్న ప్రియాంక గాంధీ.

ఈ రోజు కూజా తోడుగా ప్రియాంక గాంధీ ఉండనున్నారు. రెండవ రోజు రెండు విడతలుగా మొత్తం 6 గంటల పాటు సోనియా గాంధీ ని విచారణ చేసిన ఈడి అధికారులు… గత గురువారం సుమారు 3 గంటలపాటు విచారణ సాగింది. “యంగ్ ఇండియన్” సంస్థ కు, “నేషనల్ హెరాల్డ్” కు జరిగిన లావాదేవీల్లో సోనియా గాంధీ ప్రమేయాన్ని నిన్న ఈడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది.

రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలను, సోనియా గాంధీ ఇస్తున్న సమాధానాలతో ఈడి అధికారులు పోల్చి చూస్తున్నట్లు సమాచారం. “యంగ్ ఇండియన్” ప్రయువేటు సంస్థ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి మెజారిటీ షేర్లు ఉన్నాయి. “నేషనల్ హెరాల్డ్” పత్రిక, “యంగ్ ఇండియన్” సంస్థల్లో రాహుల్ గాంధీ నిర్వహణ పాత్ర, ఇతర కార్యవర్గ సభ్యుల బాధ్యతలు గురించి సోనియా గాంధీ ని నిన్న ఈడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version