గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి పై కుమారుడు సంచలన వ్యాఖ్యలు

-

గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణంపై అతని కుమారుడు ఉమర్ అన్సారీ సంచలన ప్రకటన చేశారు. అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు దీనిపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు వివరించారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన తన తండ్రిని చూసేందుకు వచ్చానని.. కానీ తనను అనుమతించలేదని అన్నారు.

ముఖార్ అన్సారీ మరణంపై, కుమారుడు ఉమర్ అన్సారీ మాట్లాడుతూ.. అడ్మినిస్ట్రేషన్ నుంచి తనకు ఏమీ చెప్పలేదని అన్నారు. ఈ విషయం తనకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. రెండు రోజుల క్రితం నేను ఆయనను కలవడానికి వచ్చానని తెలిపారు. కానీ తన తండ్రిని కలిసేందుకు తనను అనుమతించలేదన్నారు. ముఖ్తర్ కు స్లో పాయిజన్ ఇచ్చారని ఇంతకు ముందు కూడా చెప్పామని.. ఇప్పుడు కూడా చెబుతున్నాం అని అన్నారు. మార్చి 19న డిన్నర్ లో విషం ఇచ్చినట్లు ఉమర్ తెలిపారు. దీనిపై న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version