క్రికెట‌ర్ రైనాకే సాయం చేసిన సోనూసూద్‌.. నువ్వు దేవుడివ‌య్యా

ఆప‌దొస్తే గుర్తొకొచ్చే పేరు అత‌నిది. ఎవ్వ‌రైనా స‌రే నేనున్నానంటూ అభ‌య‌హ‌స్తం ఇస్తుంటాడు. ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఈ ఆప‌ద్భాంధ‌వుడు.. ఇప్పుడు మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. అయితే ఈ సారి సెల‌బ్రిటీకి సాయం చేశాడు.

పెద్ద పెద్ద రాజ‌కీయానాయ‌కులే మిన్న‌కుండిపోతే.. ఈ రియ‌ల్ హీరో మాత్రం నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తానున్నంత వ‌ర‌క‌కు ఎవ‌రికీ ఆప‌ద రానివ్వ‌నంటూ ఆదుకున్నాడు. అయితే ఇది కాస్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క్రికెట‌ర్ రైనా మీరట్‌లో ఉన్న 65 ఏళ్ల తన ఆంటీకి ఆక్సిజన్ కావాలంటూ వేడుకున్నాడు. ఎవ‌రైనా సాయం చేయాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరాడు. ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ ఉండ‌టంతో ఇబ్బందిగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అటు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రైనా. కానీ సీఎం స్పందించ‌లేదు. అయితే నేనున్నానంటూ సోనూ సూద్ మాత్రం వెంటనే స్పందించాడు. రైనా నుంచి వివ‌రాలు తీసుకుని త‌న ఫౌండేష‌న్ ద్వారా ఆక్సిజ‌న్ అందించి నిండు ప్రాణం కాపాడాడు. ఎంతైనా సోనూసూద్ గ్రేట్ క‌దా.