Srilanka : ఇంటి దారి పట్టిన లంక..గ్రౌండ్‌ లోనే ఏడుపులు

-

WCలో శ్రీలంక ఇంటి దారి పట్టింది. శ్రీలంక 27 ఏళ్ల వరల్డ్ కప్ కళాశాకారం కాలేదు. 1996లో ఆ జట్టు వరల్డ్ కప్ నెగ్గింది. అదే మొదటిది. అదే చివరిది కూడా. 2007లో ఆస్ట్రేలియా చేతిలో, 2011లో ఇండియా చేతిలో ఓడి రన్నరప్ గా సరిపెట్టుకుంది. తాజా WCలో సెమీస్ చేరలేకపోయింది. వీటికి తోడు లంక క్రికెట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేయడం, నిన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడంతో లంక క్రికెటర్లు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఫోటోలో ఉన్నది స్పిన్నర్ మహీష్ తీక్షన.

శ్రీలంక ఓడిపోవడంతో… గ్రౌండ్‌ లోనే పడుకున్నాడు స్పిన్నర్ మహీష్ తీక్షన. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్.. సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు. అయితే… అప్పటికే టైం ఔట్ అని అప్పీల్ చేశాడు బంగ్లా కెప్టెన్ షకీబ్. బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పారు ఎంపైర్లు. కానీ బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో బ్యాటింగ్ చేయకుండానే ఔట్‌గా వెనుదిరిగాడు మాథ్యూస్.

Read more RELATED
Recommended to you

Latest news