ఈ భూమ్మీద తల్లిపాలను మించి శ్రేష్టమైనది ఇంకోటి లేదంటారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించడం వల్ల వారి ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాదు బిడ్డకు కొన్ని ఏళ్లు వచ్చే వరకూ కేవలం తల్లిపాలు ఇస్తే వారి రోగనిరోదక శక్తి మెరుగుపడుతుంది. భవిష్యత్తులో రోగాల భారిన పడకుండా ఉండొచ్చు అంటారు. కానీ ఈరోజుల్లో చాలా మంది డబ్బా పాలనే అలవాటు చేస్తున్నారు. అందుకే ఈ జనరేషన్ పిల్లలు అంత త్వరగా లావు అయిపోతున్నారు. అదంతా బలం వల్ల వచ్చిన లావు కాదు, కొవ్వు వల్ల వచ్చిందే.! తల్లిపాలను భర్తీ చేయగలిగినది ఇప్పటివరకూ ఏదీ లేదనుకున్నాం, కానీ ఒకటి ఉంది. స్పిరులినా ఆకుల్లో తల్లి పాలకు సమానంగా పోషకాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఇది సముద్ర గర్భంలో పెరుగుతుంది. ఈ క్రమంలో స్పిరులినా వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాలకన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలకు ఎంతో బలం కలుగుతుంది. దేహ నిర్మాణానికి, కణజాలాల మరమ్మతులకు, కొత్త కణజాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువగా అవసరం అవుతాయని అందరికీ తెలిసిందే. అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. మనకు లభిస్తున్న అన్ని ఆహార పదార్థాల్లోకెల్లా అత్యంత గరిష్టంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం ఇదే అని సైంటిస్టులు అంటున్నారు.
నాన్ వెజ్ తినని వారు దీని పొడిని తీసుకుంటే చాలు. ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. శరీర పెరుగుదలకు అవసరమైన అమైనో యాసిడ్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. నరాల బలహీనత పోతుంది. లివర్‌ను శుభ్ర పరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
శరీరంలోని హార్మోన్ల పనితీరు మెరుగు పడుతుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కని మందుగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. విటమిన్లు ఎ, కె1, కె2, బి12, ఐరన్, మెగ్నిషియం, క్రోమియం, ఫైటో న్యూట్రియెంట్లు, కెరోటినాయిడ్స్, జీఎల్ఏ, ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి.
క్యారెట్ కన్నా ఎక్కువే..
క్యారెట్ల కన్నా 2800 శాతం బీటా కెరోటీన్, పాలకూరలో కన్నా 3900 శాతం ఎక్కువ ఐరన్, బ్లూబెర్రీలలో కన్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తల్లిపాలతో సమానంగా పోషకాలు కలిగిన ఆహార పదార్థాల జాబితాలో చేర్చిందంటనే అర్థమవుతుంది ఇది ఎంత మేలైనదో. యితే మనకు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల పొడి దొరుకుతుంది. ఈ పొడి టాబ్లెట్ల రూపంలోనూ లభిస్తుంది. దీన్ని వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.