ఆ విషయంలో అమిత్ షా సిగ్గుపడాలి – మంత్రి కారుమూరి

-

విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అన్ని రంగాలలో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే.. ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని అమిత్ షా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం అమిత్ షా విశాఖ సభలో వేదికపై ఉన్నవారు అందరూ టిడిపి నుండి బిజెపిలోకి వచ్చిన వారే ఉన్నారని.. వారి మనసు ఒకచోట, మనుషులు మరోచోట ఉన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.

టిడిపి నేతలు చెప్పిన మాటలనే అమిత్ షా మాట్లాడారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు మంత్రి కారుమూరి. టిడిపి చెప్పుడు మాటలు విని మాట్లాడవద్దని హితవు పలికారు. గతంలో అమరావతి పెద్ద స్కాం అని చెప్పి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు ఏళ్ల తరబడి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారని.. దీనిపట్ల అమిత్ షా సిగ్గుపడాలని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version