Chandrayaan 3: పాఠ్యాంశంగా చంద్రయాన్-3 విజయం!

-

భారతదేశం మొత్తాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా గగనతలంలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. ఈ చంద్రయాన్ 3 గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. చంద్రయాన్-3 గురించి ఇస్రో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తోంది.

ఆగస్టు 23న ల్యాండర్ మాడ్యూల్… చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే HD వీడియోను ఇస్రో వెబ్సైట్ లో ఉంచింది. ల్యాండర్ వేగంగా దూసుకొచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా ల్యాండ్ అవ్వడాన్ని వీడియోలో చూడొచ్చు. అయితే… చంద్రయాన్-3 విజయాన్ని రాబోయే విద్యా సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

త్వరలో జరగనున్న ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహేష్ తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2023 జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు చేపట్టగా… ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగి భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news