సుప్రీకోర్టు కీలక తీర్పు.. ఆ మహిళకు అబార్షన్ కి అనుమతి

-

అబార్షన్ల విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో వచ్చిన గర్భం విషయంలో ఒంటరి మహిళ కూడా అబార్షన్  చేయించుకోవచ్చని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 20-24 వారాల లోపు గర్భం తీయించుకోవడానికి ఒంటరి మహిళకు, పెళ్లి కాని మహిళకూ ఎవరి అనుమతీ అవసరం లేదని కూడా  తేల్చి చెప్పింది. అంతేకాదు.. భర్త భార్యతో బలవంతంగా కలవడం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకునే హక్కు కూడా మహిళకు ఉందని సుప్రీంకోర్టు  వెల్లడించింది. 

అయితే తాజాగా మరో తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఇద్దరూ పిల్లలు ఉన్న ఓ వివాహిత మళ్లీ గర్భం దాల్చింది. దీంతో పుట్టబోయే బిడ్డను తాను పోషించలేని స్థితిలో ఉన్నానని.. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. ఓ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకున్నటువంటి ట్రీట్ మెంట్ సంబంధించిన వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. మానసిక, ఆర్థిక సమస్యలు ఉన్న ఆమె అన్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి అబార్షన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆమె 26 వారాల గర్భవతి కావడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news