భార్యతో బలవంతపు సెక్స్ కూడా రేప్ కేసే – సుప్రీం కోర్టు

-

అబార్షన్‌ హక్కుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అబార్షన్‌కి వివాహిత, అవివాహిత అనే తేడా సరికాదు.. అవాంచిత గర్భాన్ని తొలగించుకునే హక్కు స్త్రీకి ఉంది, గర్భం దాల్చిన 24 వారాల లోపు అబార్షన్‌ చేయించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.

Indian Supreme Court

అలాగే భార్యపై బలవంతపు శృంగారం అత్యాచారంగానే చూడాలని వెల్లడించింది. బలవంతపు శృంగారం ద్వారా కలిగే గర్భాన్ని తొలగించుకునే హక్కు భార్యకు ఉంటుందని తెలిపింది సుప్రీం కోర్టు.

ఆధునిక కాలంలో వివాహిత స్త్రీలు మాత్రమే శృంగారంలో పాల్గొనాలనే నిబంధనలు ఏమీ లేవని.. MTP చట్టం నేటి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. పాత నిబంధనలకు పరిమితం కాకూడదు. చట్టం అలాగే ఉండకూడదని.. స్థిరంగా మరియు మారుతున్న సామాజిక వాస్తవాలను గుర్తుంచుకోవాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version