కోర్టును బెదిరించాలనుకుంటున్నారా.. లాయర్ పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఫైర్

-

దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం రోజున ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు సీజే జస్టిస్ డి.వై. చంద్రచూడ్ను ఓ న్యాయవాది అసహనానికి గురి చేశారు. దీంతో సహనం కోల్పోయిన సీజేఐ ఆ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించండి.. కోర్టును బెదిరించాలనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. అసలేం జరిగిందంటే..?

ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో.. సీజేఐ అతడిని సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్‌ చేస్తారని ప్రశ్నించారు. గొంతును పెంచడంద్వారా కోర్టును బెదిరించలేరని అన్నారు. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్న సీజేఐ.. తన పదవి ఆఖరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ‘గొంతు తగ్గించండి. దేశంలోని తొలి కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా.. ఎల్లప్పుడూ ఇలాగే జడ్జిల దగ్గర అరుస్తూ ఉంటారా..’ అని న్యాయవాదిపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐ ఆగ్రహానికి గురైన ఆ న్యాయవాది ఆయనకు క్షమాపణలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news