నీట్ పేపర్ లీక్ పై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ సంచలన కామెంట్స్

-

నీట్‌-యూజీ 2024 క్వశ్చన్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు జరుగుతున్నాయి. బిహార్‌ పోలీసుల దర్యాప్తు రిపోర్టును ఉటంకిస్తూ.. నిందితులకు మే 4వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. లీక్‌ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ డీవై చంద్రచూడ్‌ అనుమానం వ్యక్తం చేశారు. అలా అయితే.. స్ట్రాంగ్‌ రూమ్‌ వాలెట్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా? అని ప్రశ్నించారు.

‘అంతకుముందు పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా తన వాదనలు వినిపించారు. 161 వాంగ్మూలాలు పేపర్‌ లీక్‌ మే 4వ తేదీ కంటే ముందే చోటుచేసుకొందని బలంగా చెబుతున్నాయి. బిహార్‌ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్‌ చేయటానికి ముందే లీకైంది. మే 3వ తేదీ లేదా అంతకంటే ముందే పేపర్‌ బయటకు వెళ్లిండొచ్చు. ఇదేదో 5-10 మంది విద్యార్థుల కోసం చేసిన లీకేజీ కాదు. కచ్చితంగా ఓ గ్యాంగ్‌ ఎప్పటినుంచో ఈ పని చేస్తోంది’ అని హుడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news