కేజ్రీవాల్‌కు షాక్.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు

-

లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైంది. తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయనకు మాత్రం మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇదే కేసులో ఆయన ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఆయన కస్టడీని ఇటీవలే దిల్లీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయి ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉంటున్న కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో ఆయణ్ను మంగళవారం రోజున దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కూడా సెప్టెంబర్ 2వరకు పొడిగించారు.

Read more RELATED
Recommended to you

Latest news