స్పీకర్, గవర్నర్ నిర్ణయం తప్పు.. శివసేన సంక్షోభంపై సుప్రీం వ్యాఖ్యలు

-

మహారాష్ట్రలోని శివసేన శివసేన సంక్షోభంపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. శివసేన ఉద్ధవ్ వర్గం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. పార్టీల వివాదం పరిష్కారానికి విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గం కాదని తెలిపింది. మహారాష్ట్ర స్పీకర్‌ నిర్ణయాలను సుప్రీం తప్పుబట్టింది.

శిందే వర్గానికి చెందిన గోగావాలేను శివసేన చీఫ్‌ విప్‌గా స్పీకర్‌ నియమించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. పార్టీ నియమించిన విప్‌ను మాత్రమే స్పీకర్‌ గుర్తించాలన్న చెప్పింది. అధికారిక విప్‌ను గుర్తించడంలో స్పీకర్‌ విఫలమయ్యారని వెల్లడించింది. రెండు వర్గాల విభేదాలపై స్పీకర్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనంతరం ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున ఉద్ధవ్​ ఠాక్రేను సీఎంగా పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. అయితే గతేడాది జూన్‌ 30న బల నిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశించటం సమర్థనీయం కాదని….తేల్చిచెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version