జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదు: ఎర్రబెల్లి

-

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. వారిని ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె విరమించాలని ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. ఇప్పటికైనా వారు చేస్తున్న సమ్మె విరమిస్తే బాగుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేపీఎస్‌లపై మంచి అభిప్రాయం ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ప్రభుత్వాన్ని శాసించాలని అనుకోవడం తప్పని హితవు పలికారు. JPSలు సమ్మె విరమిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా సాయం చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని JPSలకు ఎర్రబెల్లి దయాకర్‌ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version