బాణసంచాపై నిషేధం దిల్లీసహా అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుంది: సుప్రీంకోర్టు

-

పండుగల సందర్భంగా ముఖ్యంగా దీపావళి వేళ శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీం కోర్టు బాణసంచాపై నిషేధం విధించింది. ఈ నిషేధం అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుందని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాణసంచాలో బేరియం సహా నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దిల్లీ సహా దేశమంతటికి వర్తిస్తాయని ధర్మాసనం తేల్చి చెప్పింది.

కొత్తగా మళ్లీ ఉత్తర్వులు అవసరం లేదని…. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌ సహా అన్ని రాష్ట్రాలు పండుగల వేళ వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news