రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ట్రైన్లలో అలాంటి వస్తువులు తీసుకెళ్తే మూడేళ్ల జైలు

-

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక..రైళ్లలో టపాసులు తీసుకెళ్లేవారికి రైల్వేశాఖ హెచ్చరికలు జారీచేసింది. రైల్వే స్టేషన్లు, ట్రైన్ లలో క్రాకర్స్ తీసుకెళ్తూ దొరికితే రూ. 1000 ఫైన్ లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. నేర తీవ్రతను బట్టి రెండు ఉండే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళుతున్నట్లు కనిపిస్తే 139 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Train accident in AP
Train 

ఇది ఇలా ఉండగా, పండుగల సందర్భంగా ముఖ్యంగా దీపావళి వేళ శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీం కోర్టు బాణసంచాపై నిషేధం విధించింది. ఈ నిషేధం అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుందని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. 2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news