లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సింది దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని పేర్కొంది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరడం న్యాయబద్ధమైన విషయమని, కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఏప్రిల్ 10వ తేదీన కొట్టివేసింది. అనంతరం పిటిషనర్ కాంత్ భాటి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.