సీఈసీ, ఈసీ నియామకాల కొత్త చట్టంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

-

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి ఇటీవలే కేంద్ర సర్కార్ కొత్తగా ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించేందుకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఇందులో భాగంగా ఈ పిటిషన్లపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

పాత చట్టం ప్రకారం సీఈసీ, ఈసీలను ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమించే వారు. కానీ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇక నుంచి ఈ బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహిస్తాయి. కొత్త చట్టం ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఉందనే విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాది గోపాల్‌ సింగ్‌ సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వాదనలు వినకుండా స్టే విధించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version