హనుమకొండ SR యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

-

హనుమకొండ జిల్లా అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో దీప్తి రాఠోడ్ అనే విద్యార్దిని ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. దీప్తి కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “దీప్తి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం హాస్టల్ వద్దకు చేరుకున్నాం. మేం వెళ్లే సరికి ఆమె ఉరి వేసుకుని వేళాడుతూ ఉంది. తోటి విద్యార్థులను ఆరా తీయగా ఇటీవలే పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని చెప్పారు. అయితే ఆ పరీక్షల్లో దీప్తి ఫెయిల్ అయినట్లు గుర్తించాం. అందువల్లే మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. వీలైనంత త్వరగా దీప్తి ఆత్మహత్యకు కారణాలు వెల్లడిస్తాం అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version