న్యూస్‌క్లిక్ ఎడిట‌ర్ విడుద‌ల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

-

న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబిర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రబిర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయణ్ను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీసేలా చైనా నుంచి న్యూస్‌ పోర్టల్‌కు భారీ మొత్తంలో నిధులు అందాయని.పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది దేశద్రోహం కిందికే వస్తుందని వివరించారు.

2019నాటి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రబిర్‌ పీపుల్స్‌ అలయన్స్ ఫర్‌ డెమోక్రసీ అండ్ సెక్యూలరిజం-PADSతో కలిసి కుట్రపన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా ప్రబిర్‌ అరెస్టు చెల్లదని స్పష్టం చేసింది. ఈ కేసులో రిమాండ్‌ కాపీని సమర్పించలేదని వ్యాఖ్యానిస్తూ.. రిమాండ్‌ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. నిందితుడి తరఫు న్యాయవాదికి అరెస్టుకు సంబంధించిన కాపీ అందకముందే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌కు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news