వీధి కుక్కలపైన అంత ప్రేమ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టొచ్చు కదా ?… వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటే స్థానికులు వేధిస్తున్నారని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్లో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వీధికుక్కలకు ఆహారం పెట్టే బాధ్యత సంక్షేమ సంఘాలకు, అపార్ట్మెంట్ ఓనర్లకు ఉంటుందని, వాటికి వీధుల్లో ఆహారం పెట్టేందుకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు నోయిడాకు చెందిన వ్యక్తి.

వీధికుక్కలు వాకింగ్ చేస్తున్న వారిపై, వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని పేర్కొంది అలహాబాద్ హైకోర్టు. పిటిషనర్‌కు కుక్కలపై అంత ప్రేమ ఉంటే తన ఇంట్లోనే వారికి షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించింది. ఇక అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు పిటిషనర్. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, వీధికుక్కలు వల్ల ప్రాణాలు పోతున్నాయని, అవసరమైతే మీ ఇంట్లోనే వాటికి ఆహారం పెట్టుకోండి అని పిటిషనర్‌కు సూచించింది సుప్రీం కోర్టు.