హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

-

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తన అరెస్టును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా..  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చి, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు.

కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని హేమంత్ సోరెన్‌ తన పిటిషన్ లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news