స్వలింగ సంపర్క వివాహాలపై 4 వేర్వేరు తీర్పులు.. ఆర్టికల్​ 21 ప్రకారం వారికి హక్కు ఉందన్న సుప్రీం కోర్టు

-

స్వలింగ సంపర్కుల వివాహాల పిటిషన్లపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయడం పార్లమెంటు విధి అని.. కోర్టులు చట్టాలు తయారు చేయలేవని వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కం.. నగరాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదని.. వివాహ చట్టంలో మార్పు అవసరమా కాదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ.. దాఖలైన 21 పిటిషన్లపై జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌ రవీంద్ర భట్, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ P. S. నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

“స్వలింగ సంపర్కులపై వివక్ష చూపకూడదు.. అందరినీ సమానంగా చూడాలి. భిన్న లింగ జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించడం లేదు. అలా భావిస్తే అది స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించినట్టే. ఆర్టికల్​ 21 స్వేఛ్చ, సమానత్వ హక్కు ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఆ వ్యక్తికే ఉంటుంది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. న్యాయస్థానం ఆ చట్టాన్ని రూపొందించదు.” అని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news