షాకింగ్‌ : మా నాన్నే లైంగికంగా వేధించాడు.. స్వాతి మలివాల్‌ సంచలనం

-

సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ ఎనిమిదేళ్ల వయసులోనే తాను తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ మహిళా దినోత్సవం ముందురోజు వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మాలీవాల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. చిన్నతనంలో తాను కూడా తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టు ఆమె తెలిపారు. మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్వాతి మాలివాల్ మాట్లాడుతూ, మహిళా అవార్డు గ్రహీతలు ఎదుర్కొన్న పోరాట గాధలు తన చిన్ననాటి సంఘర్షణను గుర్తుచేసిందని వెల్లడించారు.

మా నాన్న నన్ను బాగా కొట్టేవాడు. చాలా భయం వేసేది. ఆయన ఇంటికి రాగానే మంచం కింద దాక్కునే దానిని. ఇలాంటి అకృత్యాలకు వ్యతిరేకంగా మహిళా సాధికారతను ఎలా సాధించాలనే దానిపై ఆ రాత్రంతా నేను ఆలోచించేదాన్ని. మా నాన్న నా జట్టు పట్టుకుని గోడకేసి బలంగా కొట్టేవాడు. అలాంటి క్షణాల్లోనే మహిళా సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పం నాలో చాల బలంగ కలిగింది అని స్వాతి మాలీవాల్ తెలిపారు. నాలుగో తరగతి వరకూ తండ్రితో తాను ఉన్నట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version