భారత్‌కు చేరుకున్న ఉగ్రవాది తహవూర్‌ రాణా

-

26/11 ముంబయి ఉగ్ర దాడిలో కీలక నిందితుడు, లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా భారత్‌కు చేరుకున్నాడు. అతణ్ని తీసుకువస్తున్న ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా SWAT కమాండో బృందం మోహరించింది. పటిష్ఠ భద్రత నడుమ తహవూర్‌ రాణాను ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి రాణాను తరలిస్తున్నారు. అనంతరం రాణాను NIA విచారించనుంది. ఈ క్రమంలో ఎన్‌ఐఏ హెడ్ ఆఫీసు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

మరోవైపు  తహవూర్ రాణాపై ఎన్​ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి కేంద్ర సర్కార్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా నరేందర్ మాన్​ను నియమించింది. ఎన్​ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. దాదాపు  3 ఏళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యే వరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా నరేందర్ మాన్ కొనసాగనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news