తాజ్‌మహల్ సందర్శకులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఫిబ్రవరి 12న తాజ్‌మహల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు గంటలపాటు సందర్శకులను ఎవ్వరనీ అనుమతించేది లేదని అధికారులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న విదేశీ ప్రతినిథులు తాజ్‌మహల్, ఎర్రకోట, బేబీ తాజ్‌తోపాటు ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సందర్శకుల అనుమతి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.