లోకేష్‌ పాదయాత్ర రోజే…జమున మరణం, తారక్‌ కు గుండె పోటు – మంత్రి కారుమూరి

-

నారా లోకేష్‌ పాదయాత్ర పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివాదస్పద కామెంట్స్ చేశారు. యువగళం పాదయాత్ర మొదటి రోజే సినీ నటి జమున మరణమని..పాదయాత్రలో గుండెనొప్పితో కుప్పకూలి చావు బతుకుల మధ్య తారకరత్న ఉన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ ను జాదురెడ్డి అని విమర్శించే అర్హత లోకేష్ కు ఉందా..ఇంతవరకు వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ ఏమని పాదయాత్ర చేస్తున్నాడని అని మండిపడ్డారు.

బాబు వస్తే జాబు వస్తది అని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు ఒక్క జాబు ఇవ్వలేదు..ఉద్యోగాల పేరిట యువకులను నయవంచన చేసి యువగళం పేరిట పాదయాత్ర చేయడం విడ్డూరమని మండిపడ్డారు. జాబ్ నాకు ఇచ్చావు కానీ యువకులకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును లోకేష్ ప్రశ్నించాలి..సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారన్నారు. దేశంలో చిన్న వయసులోనే పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్..కులాలకు అతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ దని కొనియాడారు. లోకేష్ నువ్వు పప్పు.. వేస్ట్ గాడివి..బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version