ఆ రాష్ట్రంలో ఇకనుంచి.. ప్రతి లిక్కర్ బాటిల్‌పై ₹.3 పన్ను

-

2023-24 ఏడాదికి గానూ నూతన ఎక్సైజ్‌ పాలసీకి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే ఉత్తరాఖండ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో బాటిల్‌పైన రూ.150 మొదలు రూ.200 వరకు వ్యత్యాసం ఉంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌లోకి భారీగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ లిక్కర్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో కీలక మార్పు చేసింది. యూపీతో పోల్చితే మద్యం ధరల వ్యత్యాసాన్ని ఒక్కో బాటిల్‌పై రూ.20కి తగ్గించింది.

అంతే కాకుండా కొత్త పాలసీతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మరో ఆలోచన కూడా చేసింది. అదేంటంటే.. ప్రతి లిక్కర్ బాటిల్‌పై ఒక్క రూపాయి చొప్పున ఆవు పన్ను, క్రీడా పన్ను, మహిళా సంక్షేమ పన్నును విధించారు. అంటే మద్యం ప్రియులు ఈ మూడు పన్నులకు కలిపి ఒక్కో బాటిల్‌ ధరపై అదనంగా రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఎక్సైజ్‌ రెవెన్యూ లక్ష్యాన్ని ఉత్తరాఖండ్‌ సర్కారు రూ.4 వేల కోట్లుగా నిర్దేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version