ఫిష్‌ కామెంట్లకు ఆరెంజ్‌తో చెక్‌..: తేజస్వీయాదవ్‌ కౌంటర్ అదిరిందిగా

-

ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ భోజనంలో భాగంగా చేప తింటున్నప్పుడు చిత్రీకరించిన వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఓవైపు నెటిజన్లు.. మరోవైపు బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. దీంతో ప్రచారం కోసం చేసిన వీడియో కాస్త వివాదాస్పదమైంది. అయితే తాజాగా తేజస్వీ యాదవ్ ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్కు కౌంటర్ మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

‘‘మేము హెలికాప్టర్‌లో ఆరెంజ్‌ పార్టీ చేసుకున్నాం. నారింజ రంగుతో వారికి చిరాకురాదులే. అంతేకదా..?’’ అని తేజస్వి యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో నేత ముకేశ్‌ సాహ్నీతో కలిసి ఆరెంజ్‌ను ఆస్వాదిస్తూ ఈ వీడియోలో కనిపించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు తమపై విమర్శకులకు ఈ విధంగా తేజస్వి బదులిచ్చారు.

చేప తింటూ తీసుకున్న వీడియోపై తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతనవాది’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. వీటిపై తేజస్వి స్పందిస్తూ.. అది పాత వీడియో అని తెలిపారు. తన పేరు చెడగొట్టేందుకు ప్రయత్నించేవారి తెలివితక్కువతనాన్ని బహిర్గతం చేయడంలో విజయం సాధించానని స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version