బీసీల విషయంలో కాంగ్రెస్ చేతలకే పరిమితం కారాదు: కేటీఆర్‌

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్‌ ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ చేతలకే పరిమితం కారాదని అన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసిన కేటీఆర్ నివాళులు అర్పించారు.

వివక్షపై విద్యతోనే విజయం సాధించవచ్చని తన ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పూలే అని కేటీఆర్ కొనియాడారు. పూలే ఆశయాలను చేతల్లో చూపిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఫలాలు అందాలని ప్రయత్నించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన అని పునరుద్ఘాటించారు. నేతన్నల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం మార్పు తీసుకువచ్చిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version