పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేస్తోంది ఇండియా. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాక్ డ్రిల్ ప్రోగ్రాం ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి దేశవ్యాప్తంగా 259 ప్రాంతాలలో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించనున్నట్లు.. ఇటీవల ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలో కూడా డ్రిల్ జరుగుతుందని ప్రకటించారు. కాశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో కూడా అత్యధిక ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే.. అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. దీంతో ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.