ఆపరేషన్ సింధూర్ పై అజిత్ దోవల్ స్పందించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం క్షిపణి దాడి చేసిందని పేర్కొన్నారు. 8 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి తెలిపారు. పహల్గాంలో న్యాయం జరిగింది… భారత్ మాతా కీ జై అన్నారు అజిత్ దోవల్.
ఇక అటు ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లొని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. హతమైన టెర్రరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అటు పాక్ ఆర్మీ దాడిలో ముగ్గురు భారత్ పౌరులు మృతి చెందారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పుకొడుతోంది.