పార్లమెంట్ లో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనున్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యంతర బడ్జెట్ లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసమే ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా, నిన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిచారు. కొత్త పార్లమెంటులో నా తొలి ప్రసంగం అంటూ ముర్ము తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని అన్నారు.