కెనడాలో దారుణం, ప్రియురాలు మోసం చేసిందని భారతీయుడు ఆత్మహత్య

కెనడాలో దారుణం జరిగింది. భారతీయ విద్యార్ధి ప్రణయ్ తన ప్రియురాలు మోసం చేసింది అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక లేఖను విడుదల చేసి అతను కెనడాలో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే అతను గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె అతనిని మోసం చేసి మరొకరితో ఉంటుంది. ఈ విషయం అతనికి తెలిసింది. ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించాడు.

మాజీ ప్రియుడుతో ఆమె చాటింగ్ చేస్తుంది అని, తాను వద్దు అని చెప్పినా సరే ఆమె మాత్రం ఆగలేదు అని, ఇది కరెక్ట్ కాదని చెప్తే తనను మోసం చేసింది అని ఆవేదన వ్యక్తం చేసాడు. తన అవయవాలను దానం చేయాలని, తన శరీరాన్ని పరిశోధనలకు వాడుకోవాలని అతను లేఖలో పేర్కొన్నాడు.