పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఇవాళ విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారి కోసం రూ. 13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని మోడీ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి 25 వరకు పొడిగించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను మోడీ ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. వారితో సెల్ఫీలు దిగుతూ కాసేపు ముచ్చటించారు.
కాగా, సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ కి విముక్తి లభించేది కాదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ…హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభకాంక్షలు చెప్పారు. అమరులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ కు నివాళులు అర్పిస్తున్నామని.. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ కి విముక్తి లభించేది కాదన్నారు.