చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి పేరు పెట్టారు ప్రధాని మోడీ. చంద్రుడిపై చంద్రయాన్-3 లాండర్ దిగిన ప్రాంతానికి శివ్ శక్తి అనే పేరు పెడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన సభలో ఈ మేరకు నామకరణం చేశారు ప్రధాని మోదీ.
చంద్రయాన్-3 ప్రాజెక్టులో మహిళల శక్తి ఎంతో ఉందని, దీని ద్వారా మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి చాటామని పేర్కొన్నారు. అలాగే చంద్రయాన్-2 తన ముద్రలు వదిలిన ప్రాంతానికి తిరంగా అని పేరు పెట్టినట్లు ప్రకటించారు.