మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు.. తెగించి ఆపిన సెక్యూరిటీ!

-

నేటితరం ప్రతి చిన్న సమస్యలకే ఒత్తిడి ఫీలయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యే తమ ప్రాబ్లమ్స్‌కు సమాధానం అని వారు నమ్ముతున్నట్లు భావించడం వల్లే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే పేరెంట్స్ ఎప్పుడు నిరాశ, నిస్పృహతో ఉండే వారిని గమనిస్తూ ఉండాలని, వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పిస్తూ ఉంటే మార్పు కనిపిస్తుందని వెల్లడించారు.ఎప్పుడైతే యువత ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా డిప్రెషన్‌కు లోనవుతారో అటువంటి వారికి చనిపోవాలని అనిపిస్తుంటుందని, ఇంట్లో తరచూ గొడవలు కూడా అందుకు మరో కారణం అని పేర్కొంటున్నారు.

తాజాగా ఢిల్లీ మెట్రో ట్రాక్ పై ఓ యువతి పరుగులు తీస్తూ ఆత్మహత్యకు యత్నించింది. రైలు వస్తుండగా దానికి ఎదురుగా వెళ్లింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను రక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. ట్రాక్ మీద పరిగెత్తిన యువతి తీవ్ర ఒత్తిడితో ఉందని అందుకే ఆత్మహత్యకు యత్నించిందని, పోలీసుల ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంట్లో అప్పగించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news