Khairatabad Bada Ganesh: ఖైరతబాద్ బడా గణేష్ వద్ద భక్తుల రద్దీ..పెరిగింది. ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు..రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో ఉదయం నుంచే మొదలైంది భక్తుల తాకిడి. నాలుగు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. క్యూలైన్లతో పాటు ఎక్కువ సమయం కాకూడదని మధ్యలో నుంచి భక్తులను వదులుతున్నారు నిర్వాహకులు.
ఖైరతాబాద్ గణపతి వరకు వెళ్లకుండా ముందు నుంచి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణనాథుడు ని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఆదివారం సెలవు దినం కావడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్యా అలర్ట్ అయిన పోలీసులు..వెను వెంటనే భక్తులను క్యూ లైన్ నుండి ముందుకు కదుపుతున్నారు.